Kishan Reddy: ఆట ఇప్పుడే మొదలైంది.. నైతికంగా బీజేపీదే గెలుపు

Kishan Reddy

Central minister Kishan Reddy Comments on Munugode Bypoll: మునుగోడు ఎన్నికల పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు అని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికి మునుగోడు ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారన్నారు. స్వల్ప ఓట్ల తేడాతోనే మేము ఓడిపోయామని.. ఇప్పటినుంచి అసలు ఆట మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించేదాకా విశ్రమించేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here