ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్ కు మిగిలేది అదొక్క‌టే..

ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్ కు మిగిలేది అదొక్క‌టే..

0
101

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయ‌కులు మీడియాలో ఎంత ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ విజ‌యం టీడీపీదేన‌ని అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర 300 కోట్లు తీసుకుని ఆయ‌న‌చేతిలో ఒక నేమ్ ప్లేట్ పెట్టార‌ని అది ముఖ్య‌మంత్రి మీరేనంటు ముద్ర‌వేయించి ఆయ‌న చేతిలో పెట్టి వెళ్లార‌ని దేవినేని ఎద్దేవా చేశారు.

అయితే చివ‌ర‌కు జ‌గ‌న్ కు మిగిలేది ఆ నేమ్ ప్లేట్ మాత్రేన‌నే అన్నారు. వైసీపీ నాయ‌కులు అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించి పందాల‌కు దిగుతున్నార‌ని అన్నారు. కాగా ఇటీవ‌లే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ నేప్లేట్ తానే చేయించుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గైర‌వ ముఖ్య‌మంత్రి అన్న ప్లేట్ సామాజిక మాథ్యమాల్లలో చ‌క్క‌ర్లు కొట్టింది. ప్ర‌జా తీర్పు వెళ్ల‌డి కాక‌ముందే తానే సీఎం అని జ‌గ‌న్ ఎలా నేమ్ ప్లేట్ త‌యారు చేయించుకుంటార‌ని నెటీజ‌న్స్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ విష‌యంపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు.