ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ హిందువు… ఏడాదికి ఒక్క సారి వచ్చే దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇతర రాష్ట్రాల వారికంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల వారు దసరా పండుగను పది రోజులు జరుపుకుని దూర్గాదేవిని భక్తి చాటుకుంటారు..
అందులో ముందుగా నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.
ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుందని అంటుంటారు.