మన ఇళ్లల్లో అమ్మలు అక్కలు భార్యలు వంట వండే సమయంలో కాస్త కూరలో ఉప్పు ఎక్కువ అయితే ఇక అన్నం తినడం మానేస్తాం, అంతేకాదు అసలు దానిని ముట్టుకోవడానికి ఇష్టపడం, కాని ఇలా కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే ఇక అది తినడం కష్టం, మరి ఎలా తగ్గించాలి దీనికి ఏమైనా వంటింటి టిప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అంటున్నారు బెస్ట్ చెఫ్స్.
కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెక్కు తీసిన బంగాళా దుంప నాలుగు ముక్కలు కోసి ఆ కూరలో వేయండి, ఇలా చేయడం వల్ల ఉప్పు అలాగే అతిగా ఉన్న నీరు దుంప లాగేసుకుంటుంది.
2. ఇక గ్రేవీ కర్రస్ లో కాస్త నీరు యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిది
3.. కొద్దిగా కొబ్బరి పాలు పోసినా కూడా ఎక్కువైన ఉప్పు సరిపోతుంది,
4. ఇక నిమ్మరసం కూడా ట్రై చేయవచ్చు
5.కొంచెం గ్రేవీ కర్రీ అయితే పెరుగు ఫ్రెష్ క్రీమ్ కూడా ట్రై చేయండి లో ఫేమ్ లో పెట్టాలి
6. కొంచెం పంచదార టేస్ట్ పోకుండా వేసుకున్నా ఉప్పు తగ్గుతుంది.