భారీగా తగ్గుతున్న బంగారం వెండి ధరలు ఈరోజు రేట్లు ఇవే

భారీగా తగ్గుతున్న బంగారం వెండి ధరలు ఈరోజు రేట్లు ఇవే

0
28

బంగారం ధర రెండు రోజులుగా పరుగులు పెట్టింది, భారీగా పెరిగింది, అయితే నేడు మార్కెట్లో మాత్రం కాస్త ధర తగ్గింది, ఇది స్వల్ప తగ్గుదల అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు, ఇక వెండి ధర కూడా ఇలాగే తగ్గుతోంది.

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.100 తగ్గింది. దీంతో ధర రూ.47,100కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 తగ్గింది. దీంతో వెండి ధర రూ.62,600కు చేరింది, మొత్తానికి వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.