న్యాచురాల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం జెర్సీ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే విడుదల కాగా ఈ చిత్రం సినిమా నాని కెరీర్‌లోనే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్దా శ్రీనాథ్ తెలుగులో చేసింది మొదటి సినిమానే అయినా ప్రేక్షకుల మనసు దోచేసింది.. అయితే 2016 లో ఆమె నటించిన కన్నడ చిత్రం యూ టర్న్ అక్కడ సూపర్ హిట్‌గా నిలవగా ఈ సినిమాలో రచన పాత్రలో నటించిన ఆమెకు విమర్శకుల ప్రశంశలు దక్కాయి.. ఈ సినిమాని చూసి సమంత తెలుగు తమిళ హక్కులను సొంతం చేసుకుంది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు కాగా ఈ సినిమా పరువాలేనిపించింది.
సమంత స్టార్ ఇమేజ్ తో ఈ సినిమా గట్టెక్కిన లాభాలు మాత్రం అంతగా రాలేదని టాక్ వచ్చింది.. అయితే జెర్సీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జెర్సీ హీరోయిన్ శ్రద్ధ తెలుగు సినిమాలు ఏమైనా చూశారా అన్న ప్రశ్నకు ‘నా సినిమానే రీమేక్ చేశారని తెలిసి సమంత నటించిన యూ-టర్న్ చూశా. సినిమా బాగాలేకపోవడంతో వెంటనే టీవీని కట్టేశాను’ అంటూ చెప్పడమే సమంత అభిమానులకు కోపం తెప్పించింది. మరి దీనిపై వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి