ఫలితాలకు ముందే కడపలో జగన్ పై కొత్త వార్త

ఫలితాలకు ముందే కడపలో జగన్ పై కొత్త వార్త

0
92

తెలుగుదేశం పార్టీ ముందు నుంచి అన్నట్లే జరుగుతోంది అంటున్నారు కడప జనం .దీనికి కారణం కూడా ఉంది. ఏపీలో జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని మీడియాలు సర్వేలు చెబుతున్న సమయంలో, కొందరు కబ్జా రాయుళ్ల కన్ను స్ధలాలపై పడింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వెంచర్లు వేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. అంతేకాదు రైతుల నుంచి పెద్త ఎత్తున భూములు కొంటున్నారు. ఇంతకీ ఎక్కడ ఈ పని అని అనుకుంటున్నారా, అసలు విషయనికి వస్తే జగన్ సీఎం అయితే రాజధాని మార్పు జరుగుతుంది అని అనేక వార్తలు వినిపించాయి. ఇప్పుడు సర్వేలు జగన్ కు పాజిటీవ్ గా రావడంతో పులివెందుల కడప పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు. జగన్ సీఎం అయితే మన ప్రాంతం రాజధాని అవుతుందని అంటున్నారు. పైగా రైతుల నుంచి అతి తక్కువకు పొలాలు కూడా వస్తాయి అని చెబుతున్నారట వ్యాపారులు.

కడప జిల్లాలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు పెరిగిపోయాయి. పులివెందుల ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున భూములు, గుట్టలు కొనేవారు ముందుగానే వెంచర్లు వేస్తున్నారు.దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాపెరిగిపోయింది. ఇప్పటికే కడపలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయట. ప్రభుత్వం ఏర్పడేందుకు నెలరోజుల వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పటికే కొందరు బినామీల పేరుతో భూములు పొందిన వారు వాటిని చక్కదిద్దుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వ భూములను అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు..ఆగస్టు 1 నుంచి కొత్త స్టాంప్ డ్యూటి రానుంది ప్రభుత్వం భూముల రేట్లను కూడా పెంచనుంది దీంతో ఇక్కడ రాజధాని అంటూ పలువురు వ్యాపారాలు చేస్తున్నారట.