గత పదిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల కాస్త తెరుపు వచ్చింది, దీంతో జనం తమ పని తాము చేసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో కూడానీట మునిగిన కాలనీలు తేరుకుంటున్నాయి, ఈ సమయంలో భారీ వర్షాలకు హైదరాబాద్ లోని చెరువులు పూర్తిగా నిండాయి.
ఇలాంటి సమయంలో ఇక వర్షాలు రావు అని భావిస్తున్న వేళ, రాగల 24 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలో
నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణం ఉంది అంటున్నారు.
ఇక నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో అక్టోబర్ 29 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. అయితే ఇది ఏపీపై ప్రభావం ఉంటుంది అంటున్నారు …ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.