భారీగా తగ్గిన బంగారం ధర నేడు రేట్లు ఇవే

భారీగా తగ్గిన బంగారం ధర నేడు రేట్లు ఇవే

0
42

పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది, రెండు రోజులుగా పరుగులు పెట్టిన పుత్తడి నేడు కాస్త తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టినా కూడా దేశీ మార్కెట్లో పసిడి పడిపోవడం ఇక్కడ కొసమెరుపు. మరి నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.47,130కు చేరింది.

మరి బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా ఇలాగే ఉంది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.1000 తగ్గింది. దీంతో వెండి ధర రూ.61,500కు చేరింది, ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.