ఈ టీడీపీ ఎమ్మెల్యే గెలుపు పక్కా

ఈ టీడీపీ ఎమ్మెల్యే గెలుపు పక్కా

0
91

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని అంటున్నారు తెలుగుదేశం నేతలు.. ఈసారి గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మారతాయి అని చెబుతున్నారు.. పార్టీ తరపున టిక్కెట్లు ఇచ్చిన వారు కచ్చితంగా గెలుస్తారు అని అంటున్నారు నేతలు ముఖ్యంగా ఇప్పుడు మంత్రాలయం సెగ్మెంట్ తొలి గెలుపు అని భారీ మెజార్టీ ఇక్కడ నుంచి తథ్యం అని చెబుతున్నారు.

మంత్రాలయం నియోజకవర్గంగా 2009 లో ఏర్పడింది. అయితే ఇక్కడి నుంచి మొదటిసారి బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయన వైసీపీలో చేరి గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపైన 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాని ఇక్కడ అభివృద్ది ఏమీ చేయలేదు అని విమర్శలు ఉన్నాయి. అందుకే ఈసారి తిక్కారెడ్డికి ఓ అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అలాగే బాలనాగిరెడ్డి స్వంత గ్రామంలోకి ప్రచారానికి వెళ్లిన తిక్కారెడ్డిపై కాల్పులు జరగడం, ఆయన కాలికి గాయం అవడంతో ఆయన ప్రచారం కూడా స్ట్రేచర్ పై చేశారు. ఇక్కడ జనం కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలి అని భావించి ఓట్లు వేశారట. ఆయన భార్య కూడా ఈసారి పెద్ద ఎత్తున ఆయనతో ప్రచారం చేశారు. దీంతో తిక్కారెడ్డికి తొలి గెలుపు కర్నూలు జిల్లా నుంచి పక్కా అని, మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.