గోమాతని పూజిస్తే ఎంతో పుణ్యం- ఆ గోమాతలో ఉన్న దేవతలు ఎవరంటే

-

మన దేశంలో గోమాతని ఎంతో పూజిస్తాం, ఆవు కనిపించగానే వెంటనే దానికి చాలా మంది ఆహారం పెడతారు మొక్కుతారు, అయితే గోవుని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సిరిసంపదలు రావాలి అన్నా గోపూజ ఎంతో మంచిది, విజయాలు వస్తాయి ఆ ఇంటికి.

- Advertisement -

గోమాతలో సమస్త దేవతలు ఉన్నారు అని చెబుతారు మన పెద్దలు
గోవు పాదాల యందు – పితృదేవతలు ఉంటారు
కాళ్ళ యందు – సమస్త పర్వతములు ఉంటాయి
భ్రూమధ్యమున – గంధర్వులు ఉంటారు
గోవు దంతముల యందు – గణపతి ఉంటాడు
ముక్కున – శివుడు ఉంటాడు
ముఖమున – జ్యేష్ఠాదేవి ఉంటుంది
కళ్ళయందు – సూర్యుడు ఉంటాడు
గోవు చెవుల యందు – శంఖు చక్రములు ఉంటాయి
కంఠమునందు – విష్ణుమూర్తి ఉంటాడు
భుజమున – సరస్వతి ఉంటుంది
రొమ్మున – నవ గ్రహములు కొలువై ఉంటాయి
వెన్నులో – వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు
తోక యందు – చంద్రుడు ఉంటాడు
చర్మమున – ప్రజాపతి ఉంటారు
గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు

అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...