బంగారం కొంటున్నారా 24-22-20-18 క్యారెట్లు అంటే ఏమిటి తప్పక తెలుసుకోండి

బంగారం కొంటున్నారా 24-22-20-18 క్యారెట్లు అంటే ఏమిటి తప్పక తెలుసుకోండి

0
139

మన దేశంలో బంగారం అంటే చాలా మందికి ఇష్టం ..ప్రస్టేజ్ విషయం ఎలా ఉన్నా చాలా మంది బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టం చూపిస్తారు, అయితే మనం చాలా సార్లు వింటూ ఉంటాం, 24 క్యారెట్లు 22 క్యారెట్లు అని అసలు ఈ వివరణ ఏమిటి దాని విలువ ఎలా చూడాలి అని తెలుసుకుందాం.

మనం వినే 24 క్యారెట్ల బంగారం అంటే అది బిస్కెట్ బంగారం ఇన్వెస్ట్ మెంట్లకి బాగా వాడతారు, ఇక 22 క్యారెట్ల బంగారం అంటే మనం ధరించే ఆభరణాలు అదే బంగారంతో తయారు చేస్తారు. 22 కేరట్ల బంగారంలో 91.6 శాతం బంగారం ఉంటుంది. దీన్నే 916 బంగారం అంటారు.

ఇక తర్వాత మనకు ఎక్కువగా వినిపించేది 18 క్యారెట్లు బంగారం, ఇందులో 75 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. మీరు బంగారం కొనే సమయంలో బీఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి.ఇక 18 క్యారెట్లు 14 క్యారెట్లు అంటే అవి డైమెండ్ వజ్రాలకు కెంపులు ఇలాంటి నగల తయారీలో వాడతారు. అయితే మీరు సాధారణంగా ధరించే రింగ్స్ గాజులు చైన్స్ ఇవన్నీ 22 క్యారెట్లు తప్పక తీసుకోండి, ఇక కొనే సమయంలో కచ్చితంగా బిల్లు మాత్రం తీసుకోవాలి మర్చిపోవద్దు. తూకం కచ్చితంగా చూసుకుని బిల్లు ప్రకారం కొనుగోలు చేయాలి.