భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి తప్పక తెలుసుకోండి?

భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి తప్పక తెలుసుకోండి?

0
35

భీష్ముని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆయన గొప్ప వ్యక్తి, కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు.మరి ఆయన గురించి చెబితే కచ్చితంగా బీష్మ ప్రతిజ్ఞ గుర్తువస్తుంది, మరి దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో చూద్దాం.

సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహం చేసుకోవాలి అని శంతనుడు భావిస్తాడు, ఈ సమయంలో ఆమె తల్లిదండ్రులని కలిసి తన కోరిక చెబుతాడు, ఆ సమయానికే శంతనుడికి భీష్ముడు పుత్రుడిగా ఉంటాడు
అందుకే శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి సత్యవతి తల్లిదండ్రులు ఒప్పుకోరు.

ఈ సమయంలో తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ సమయంలో సత్యవతి తల్లిదండ్రులు ఏం చెప్పినా అన్నీంటికి భీష్ముడు ఒప్పుకుంటాడు.

తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు, అసలు వివాహమే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు, అందుకు వారు ఒప్పుకుని అతని తండ్రికి సత్యవతిని ఇచ్చి వివాహం చేస్తారు.

తన కోరిక తీర్చినందుకు తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు…తండ్రి కోసం అతను బ్రహ్మచారి గా మారిన గొప్ప వ్యక్తి భీష్ముడు.