పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రీముఖి నటిస్తోందా?

పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రీముఖి నటిస్తోందా?

0
105

పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ తో మళ్లీ అదిరిపోయే సూపర్ లుక్ తో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు, ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది, అయితే ఆయన అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు,
తాజాగా పవన్ కల్యాణ్ తో యాంకర్ శ్రీముఖి సెల్ఫీ తీసుకుంది, దీనిని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది.

ఈ సందర్భంగా శ్రీముఖి ఈ సమయంలో రాయడానికి మాటలు రావడం లేదు. లవ్ లవ్ లవ్ పవర్ స్టార్ అంటూ ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్లో ఉన్నారు.

అయితే ఆమె షూటింగ్ లో పాల్గొంటుందా లేదా ఏదైనా అక్కడ షూటింగ్ జరుగుతుంటే పవన్ తో సెల్ఫీ దిగిందా అనేది తెలియదు..ఇక మరో నెల రోజుల్లో ఈ షూటింగ్ పూర్తి అవుతుంది అని తెలుస్తోంది, సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది,, పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కీలక పాత్రల్లో అంజలి, నివేదా థామస్ నటిస్తున్నవిషయం తెలిసిందే.