బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి ఈ విషయాలు తెలుసా

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి ఈ విషయాలు తెలుసా

0
85

బిహార్ ఎన్నికల వేళ తేజస్వీ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఇలాంటి వేళ సీఎం నితిశ్ కుమార్ కూడా పొలిటికల్ ప్రచార స్టైల్ మార్చారు, మొత్తానికి తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి..

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇవే తన చివరి ఎన్నికలని ఎన్నికల ప్రచారంలో అన్నారు, అక్కడ ఉన్న పార్టీ నేతలు అలాగే ప్రజలు కూడా షాక్ అయ్యారు.

ఎన్నికల వేళ ఆయన చేసిన ఈ కామెంట్లు అందరిని షాక్ కి గురిచేశాయి.జేడీయూ నేతల్లో కలవరం కలిగింది, అయితే ఆయనని రాజకీయ బీష్మ అనే చెప్పాలి.. దాదాపు 35 ఏళ్లుగా సీనియర్ నేతగా ఉన్నారు, కాని ఆయన గురించి ఈ విషయం మీకు తెలుసా… అసలు ఆయన అసెంబ్లీకి ఒకసారి మాత్రమే పోటీ చేశారు..1977లో తొలిసారి తన సొంత జిల్లా నలందాలోని హర్నౌత్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఎక్కడా పోటీ చేయలేదు.

1989, 1991, 1996, 1998, 1999, 2004ల్లో లోక్సభకు పోటీచేసి గెలుపొందారు. కాని అనూహ్యాంగా స్టేట్ పాలిటిక్స్ లో 2005లో ఎంటర్ అయ్యారు సీఎం అయ్యారు..విధాన పరిషత్ సభ్యుడిగానే ఉన్నారు ఆయన, మొత్తానికి ఇప్పుడు ఈ కామెంట్ల వల్ల ఓటరు ఎలా ఆలోచిస్తాడో చూడాలి.