వాట్సాప్ అదిరిపోయే ఫీచర్ ఇక మెసేజ్ లు ఏడురోజులే

వాట్సాప్ అదిరిపోయే ఫీచర్ ఇక మెసేజ్ లు ఏడురోజులే

0
37

వాట్సాప్ ఇప్పటికే అనేక ఫీచర్లను తీసుకువస్తోంది, సరికొత్త అప్ డేట్ లు వస్తున్నాయి, యూజర్లకు ఏం కావాలో అది అందిస్తోంది వాట్సాప్… తాజాగా వాట్సాప్ ఎప్పట్నుంచో ఊరిస్తున్న డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ను లాంచ్ చేసింది. ఇక మరికొద్ది రోజుల్లో బహుశా ఈనెలలోనే వచ్చేస్తుంది.

ఈ ఫీచర్ ఏమిటి అంటే.. ఏడు రోజుల తర్వాత మెసేజ్లు ఆటోమేటిక్గా డిలీట్ చేసే అవకాశాన్ని ఈ ఫీచర్ అందిస్తుంది. ఇక అన్నీ ఓఎస్ లకి ఇది అందుబాటులోకి వస్తుంది.. టెలిగ్రాంలో మెసేజ్ ఎప్పుడు మాయం అవ్వాలో టైమింగ్ మనం ఎంచుకోవచ్చు. అయితే వాట్సాప్లో వారం తర్వాత ఈ మెసేజ్లు ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. ఆటోమెటిక్ గా ఇది డిలీట్ చేస్తుంది.

దీన్ని ప్రత్యేకంగా ప్రతి చాట్ విండోకు మనమే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం అవి వేరే వారికి ఫార్వెర్డ్ అయినా అవి డిలీట్ అవ్వవు, అలాగే వారు కోట్ చేసి రిప్లై ఇచ్చినా అవిపోవు, అయితే ఇవి సేవ్ చేసుకోవాలి అంటే కాపీ చేసుకోవాలి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఇక మీరు బ్యాకప్ చేసిన తర్వాత ఉంటాయి అని అనుకోకండి.. అవి రిస్టోర్ అయ్యాక డిలీట్ అవుతాయి…స్నాప్ చాట్, టెలిగ్రాం మెసెంజర్ లో ఇప్పుడు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.