జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు, దీంతో ఇక ఆయనకు శ్వేతసౌదంలోకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వనం పలుకుతారు , ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ వెనుదిరిగారు, అయితే ఇప్పుడు అమెరికా ఫస్ట్ లేడీ గురించి చర్చ జరుగుతోంది, అంతేకాదు బైడెన్ భార్య గురించి కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె పేరు జిల్ బైడెన్ జో బైడెన్ సతీమణి అమెరికా ఫస్ట్ లేడీ. జిల్ బైడెన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఆమె ప్రముఖ టీచర్ అంతేకాదు కాలేజీలో కూడా భోదన చేసింది ఆమె, మంచి టీచర్ గా పేరు సంపాదించారు, ఇటు భర్తకి ఎన్నికల సమయంలో ఎంతో ప్రొత్సాహం అందించింది.
ఇటాలియన్ మూలాలు ఉన్న జిల్ అమెరికాలో స్థిర పడ్డారు. ఫిలెడిల్ఫియాలో 1951లో పుట్టి పెరిగిన జిల్ డాక్టరేట్ చేశారు. ఉపాధ్యాయురాలుగా కూడా పని చేశారు. ఆమెకి చదువు పూర్తి అయిన తర్వాత టీచింగ్ ను ఎంచుకున్నారు, ఇక ఇంగ్లీష్ టీచర్ గా ఆమె పని చేశారు. దాదాపు 13 సంవత్సరాలు ఆమె టీచర్ గా పనిచేశారు, ఇప్పుడు ఆయనతో పాటు వైట్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.