అమర జవాను కుటుంబానికి భారీ సాయం ప్రకటించిన సీఎం జగన్

అమర జవాను కుటుంబానికి భారీ సాయం ప్రకటించిన సీఎం జగన్

0
35

మన దేశ సైనికులు కుటుంబాన్ని తల్లిదండ్రులని భార్యని పిల్లలని విడిచిపెట్టి దేశ రక్షణ కోసం వెళుతూ ఉంటారు, అలాంటి సైనికులు చేసే సేవ ఎవరూ చేయలేనిది, వెలకట్టలేనిది, అందుకే సైనికులని మనం అంతలా గౌరవిస్తాం, తాజాగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకునే క్రమంలో అసువులుబాసిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సీఎం జగన్ భారీ సాయం ప్రకటించారు.

ప్రవీణ్ కుమార్ రెడ్డి దేశం కోసం చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయం అని లేఖలో రాశారు సీఎం జగన్, అంతేకాదు ఆ సైనికుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం సహాయనిధి నుంచి ఈ ఆర్థికసాయం మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

వారి కుటుంబానికి సీఎం జగన్ ఓ లేఖరాశారు..మీ భర్త చేసిన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య రజితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దయచేసి ఈ ఆర్ధికసాయం స్వీకరించాలి అని సైనికుడి కుటుంబాన్ని లేఖలో కోరారు సీఎం జగన్ …చిత్తూరు జిల్లాకు చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వస్థలం ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామం. ఆయన మద్రాస్ రెజిమెంట్ లో హవల్దార్ గా పనిచేస్తున్నారు…ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకునే క్రమంలో వీరమరణం పొందారు ప్రవీణ్ కుమార్ రెడ్డి.