శివుడికి ఈ కార్తికమాసం అంటే ఎంతో ప్రీతికరమైన మాసం..అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో కంటే చిన్న చెంబుడు నీటితో ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు, ఆయనకు భక్తితో చెంబుడు నీటితో అభిషేకం చేసినా ఆ పుణ్య ఫలం దక్కుతుంది, ఎలాంటి దోషాలు అయినా ఈ కార్తిక మాసంలో ఆయనకు అభిషేకం చేస్తే పోతాయి అంటారు పండితులు.
శివునికి బిల్వదళములతో పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చుఅంటారు. పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ఏమంటారో తెలుసా, దీనిని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే ఎంతో మంచిది అనేది తెలిసిందే.. ఆ స్వామిని ఉదయం పూట దర్శనం చేసుకుని మీరు ఆయనకు అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం.
ఈ నెల రోజుల్లో కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం అంటున్నారు పండితులు, ముఖ్యంగా ఈ సమయంలో ఉపావాసాలు ఉండేవారు స్వామిని కొలిచే వారు సాయంత్రం శివయ్యని ఆలయంలో దర్శించుకోవాలి.