టాటూ వేయించుకున్న తరువాతే అసలు పని!

-

టాటూ అనేది ప్రస్తుతం ఓ బ్రాండింగ్‌గా‌ చూడటంతో, టాటూస్‌కు క్రేజ్‌ వచ్చేసింది. హీరోల నుంచి, సామాన్య ప్రజలు సైతం టాటూస్‌ వేయించుకోవటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. టాటూ అనేది శాశ్వతంగా ఉండేది కాబట్టి, ఎక్కువుగా జీవితంలో ముఖ్యమైన తేదీలను, ప్రియుడు లేదా ప్రియురాలి పేర్లనో, భార్య, లేదా భర్త పేర్లనో, నచ్చిన దేవుడినో, జంతువులపై ప్రేమను చూపించుకోవటం కోసం టాటూలు వేయించుకోవటం ఫ్యాషన్‌గా మారింది. టాటూను వేయించుకోవటం కోసం కొన్ని గంటలు నొప్పిని భరిస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. టాటూ వేయించుకునా్న తరువాతే అసలు కథ మెుదలవుతుంది. టాటూను రక్షించుకోవటం, చర్మాన్ని సంరక్షించుకోవటానికి చాలా చేయాల్సి ఉంటుంది. టాటూలు జీవితాంతం ఉండేవి కాబట్టి.. ఎంచుకునే డిజైన్లు, చిహ్నాల గురించి బాగా ఆలోచించుకోవాలి. టాటూ వేయగానే యాంటీబయోటిక్‌ క్రీమ్‌లను వాడాల్సి వస్తుంది. తరువాత టాటూ వేసిన ప్రాంతాన్ని బ్యాండేజీతో రక్షించాలి. ఈ కవరింగ్‌ వల్ల చర్మంపై బాక్టీరియా చేరకుండా ఉంటుంది. టాటూ ఆర్టిస్టు సూచనల మేరకు బ్యాండేజీ డ్రెస్సింగ్‌ను అలాగే ఉంచుకోవాలి. టాటూను కడగాలనుకున్నప్పుడు, బ్యాండేజీను సున్నితంగా తీయాలి. సువాసన లేని సబ్బుతో టాటూను జాగ్రత్తగా కడగాలి. తరువాత ఆల్కహాల్‌ లేదా మాయిశ్చరైజర్‌తో తుడవాలి. దీని వల్ల ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. ఒకవేళ టాటూ వేసిన ప్రాంతంలో ఏదైనా అసహజంగా అనిపిస్తే, టాటూ ఆర్టిస్టుకి లేదా డాక్టరుకు ఫోన్‌ చేసి సమస్యను వివరించాలి.. తప్పా, సొంత వైద్యం చేసుకోకూడదు. టాటూ వేయించుకున్న తరువాత కొన్ని రోజులు చర్మం ఎర్రగా రావటం, దురదగా ఉండటం సహజం. వీటికి భయపడకుండా, డాక్టర్ల సూచనలు పాటిస్తే, త్వరగా నయం అయ్యే ఛాన్సు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర...

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...