ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే మాట ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.. ఆయన అభిమానులు కన్నీటి సంద్రం అయ్యారు. గాన గంధర్వుడి గొంతు మూగబోయింది అనే మాట తట్టుకోలేకపోయింది చిత్ర సీమ.. దాదాపు దేశంలో 16 భాషల్లో 50 వేల పాటలు పాడారు ఆయన..సెప్టెంబర్ 25న ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు.
తాజాగా ఎస్పీ బాలుగారికి అరుదైన గౌరవం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నెల్లూరులోని ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు..డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్గా దీనికి పేరు పెట్టింది ఏపీ ప్రభుత్వం.
దీనిపై బాలుగారి అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు..అంతేకాదు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు అని సొంత జిల్లాలో ప్రజలు ఆయన అభిమానులు అందరూ అంటున్నారు, ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ చాలా సంతోషించారు, అంతేకాదు సర్కారుకి సీఎం జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు..ఎస్పీ బాలుగారికి భారతరత్న ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.