మీ పిల్లలు జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మీ పిల్లలు జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

0
103

ఈ రోజుల్లో జంక్ ఫుడ్ చాలా మంది తినడం అలవాటు చేసుకుంటున్నారు, అయితే ఇలా తింటే చాలా సమస్యలు అంటున్నారు వైద్యులు.. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇలా తింటే వారికి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి, ముఖ్యంగా ఫ్యాట్ పెరగడం బరువు పెరగడం పొట్ట బాణ పొట్ట ఇలాంటి సమస్యలు వస్తాయి, దీని వల్ల వచ్చే రోజుల్లో ఎదిగే కొలది వారికి ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు.

జంక్ ఫుడ్ కి మీ పిల్లల్ని దూరం చేయాలి.. అంటే ముందు మీరు కూడా ఈ టిప్స్ పాటించండి, అసలు ఇలాంటి జంక్ ఫుడ్స్ మీరు తినవద్దు.. ఇలా మీరు తినకుండా ఉంటే వారు తినరు, ఇక ఇలాంటివి తింటే ఎలాంటి నష్టం అనేది వారికి వివరంగా ఫోటోల రూపంలో చూపించండి.

మీ పిల్లలతో కలిసి వంట, వ్యాయామం చేయండి, మొక్కల పెంపకం చేపట్టండి, వాటికి నీరు పోయడం గార్డెనింగ్ ఇలాంటివి నేర్పించండి, భోజనంలో పోషకాలు ఉన్న ఫుడ్ పెట్టండి. వాటి వల్ల ఉపయోగాలు చెప్పండి…చిరుతిళ్లకు దూరంగా ఉంచండి.
మీరు వీటికి దూరంగా ఉండాలి, పాలు డ్రై ఫ్రూట్స్ కర్జూరం పండ్లు ఇలాంటివి స్నాక్ గా ఇవ్వండి. కొత్త వంటలు ఇంట్లో చేసినవి పెట్టండి . దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.