రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు, ఈ సినిమాకి సంబంధించి జక్కన్న చాలా వరకూ కీలక సీన్స్ షూట్ చేశారు…50 రోజుల పాటు దీన్ని చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి.
అయితే తాజాగా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇవ్వనున్నాడు రామ్ చరణ్, అవును ఇప్పుడు లీవ్ తీసుకుంటున్నారట, దీనికి కారణం ఆయన చెల్లి నిహరిక పెళ్లి వేడుక, డిసెంబర్ 9న రామ్ చరణ్ చెల్లి నిహారిక పెళ్లి ఉంది. చైతన్య జొన్నలగడ్డతో ఈమె పెళ్లి జరగబోతుంది.
ఇక మెగా ఫ్యామిలీ మూడు రోజుల ముందు ఈ వివాహం కోసం ఉదయ్ పూర్ వెళ్లనున్నారు..డిసెంబర్ 9న ఉదయ్పూర్ కోటలో నిహారిక పెళ్లి జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులని మాత్రమే వివాహానికి పిలిచారు,ఇక రామ్ చరణ్ మెగా కుటుంబం అంతా కలిసి వివాహానికి అక్కడకు వెళ్లనున్నారు. రాజమౌళి కూడా ఎస్ చెప్పారట.