రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు ఎప్పటి నుంచో వచ్చాయి …అయితే 2021 అది నిజం చేయబోతోంది, రజనీ పార్టీ పెట్టనున్నారు, ప్రకటన చేశారు, ఇక వచ్చే ఏడాది పార్టీ ప్రకటన ఆ ఎన్నికల్లో పోటీ కూడా చేయనుంది. అయితే మరి సినిమాల్లో ఉండి అగ్రహీరోలు హీరోయిన్లుగా కొనసాగి రాజకీయాల్లోకి వచ్చి గెలుపు ఓటములు చూసిన వారు ఎవరు అనేది ఓసారి చూద్దాం.
తమిళ్ లో హీరో విజయ్ తండ్రి ఓ కొత్త పార్టీ పెడుతున్నారు
ఇక కమల్ హాసన్ రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పెట్టారు
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్ధాపించారు
ఎమ్జీఆర్ తమిళనాట అన్నాడీఎంకే స్ధాపించారు
శివాజీ గణేషన్ డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు తర్వాత తమిళగ మున్నేట్ర మున్నయ్ అనే పార్టీని పెట్టారు
అన్నాడిఎంకేలో జయలలిత సీఎంగా పని చేశారు
జయప్రద ముందు తెలుగు దేశం రాజ్యసభ సభ్యురాలిగా చేశారు సమాజ్ వాదీ పార్టీ తర్వాత ఆర్ఎల్డీ పార్టీలో చేరారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు తర్వాత కాంగ్రెస్ లో కొనసాగారు.
బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురం నుంచి టీడీపీ తరపున
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్దాపించారు
ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు ముందు టీడీపీ ఇప్పుడు వైసీపీ
నాగబాబు జనసేన పార్టీ
ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేశారు
నటుడు జగ్గయ్య ఎంపీగా చేశారు
కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చేశారు ఏలూరు లోక్సభ సీటుకి
కృష్ణంరాజు కూడా నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు బీజేపీ తరపున
టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా నాడు మోహన్ బాబు ఉన్నారు నేడు వైసీపీలో ఉన్నారు
టీడీపీ తరుపున బాపట్ల ఎంపీగా రామానాయుడు ఎన్నికయ్యారు
మురళిమోహన్ టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా చేశారు
విజయశాంతి బీజేపీ,తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు
జయసుధ. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేశారు
రావు గోపాల్ రావు టీడీపీ తరపున ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుడు
కైకాల సత్యనారాయణ ఎంపీగా చేశారు టీడీపీ తరపున మచిలి పట్నం