నటి శారద రియల్ స్టోరీ ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారంటే

-

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ముఖ్యంగా ఇల్లాలి పాత్రలు తల్లిపాత్రలు అంటే ముందు వినిపించేది ఊర్వశి శారద మాత్రమే..
మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం…తాడిపర్తి శారద జూన్ 25, 1945న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించారు.. శారద అసలు పేరు సరస్వతి. చిన్ననాటి నుంచి ఆమె భరతనాట్యం నేర్చుకున్నారు, తర్వాత ఆమె తల్లి ప్రొత్సాహంతో నాటకాలు కూడా వేశారు..రక్త కన్నీరు నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణం పక్కన హీరోయిన్ వేషం వేశారు.

- Advertisement -

ఇక శారద కుటుంబం ముందు నుంచి ధనికులే తండ్రి బంగారు నగలు తయారీ షాపు ఉండేది, వారు మద్రాసులో కొంతకాలం కాపురం ఉన్నారు, ఈ సమయంలో 1955లో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా ఈమె రంగప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగారు. తర్వాత ఆమె కేరళకు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు, అక్కడ మలయాళ సినిమాల్లో నటించారు, తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేశారు.

మలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. హస్యపాత్రల నుంచి తర్వాత సీరియస్ కీలక పాత్రలు ఆమెకి వచ్చాయి… 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి గెలుపొందారు, తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినిమా రాజకీయాలే కాదు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు, లోటస్ చాక్లేట్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. తర్వాత నష్టాలు రావడంతో అది కూడా అమ్మేశారు. కొంత కాలం తర్వాత ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చి హస్యనటుడు చలాన్ని వివాహం చేసుకున్నారు, తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరి మధ్య అభిప్రాయ భేధాలు వచ్చి విడిపోయారు, ఇక
ఆమెకి పిల్లలు లేకపోవడంతో ఆమె తన సోదరుడి పిల్లలని తన పిల్లలుగా చూశారు, వారి దగ్గరే ఉంటున్నారు తన ఆస్తి కూడా వారికే అందచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...