Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్(Tillu Square OTT)’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో విడుద‌లై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. మూవీలో సిద్ధు(Siddhu Jonnalagadda) కామెడీ టైమింగ్‌, అనుప‌మ(Anupama Parameswaran) రొమాన్స్ అభిమానుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో తొలి రోజు నుంచి రికార్డ్ స్టాయిలో కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. ఇప్పటివరకు ఏకంగా రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఓవైపు థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది.

- Advertisement -

Tillu Square OTT | ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. హిస్టరీ రిపీట్ అవ్వడం నార్మల్‌.. అదే టిల్లు వ‌స్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్‌ అవుతాయ్‌.. అట్లుంట‌ది టిల్లుతోని అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు పేర్కొంది. థియేట‌ర్లలో విడుదలై నెల రోజులు కూడా కాక‌ ముందే ఓటీటీలోకి రావ‌డం ఆసక్తికరంగా మారింది. మరి ఓటీటీలోనూ టిల్లుగాడు ఎలాంటి రికార్డులు సృష్టి్స్తాడో చూడాలి.

Read Also: ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...