మండోదరి రామాయణం తెలిసిన వారికి బాగా తెలిసిన ఆమె,రావణాసురుని భార్య. మన ప్రపంచంలో ఉన్న పతివ్రతల్లో మండోదరి కూడా ఒకరు, అయితే మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్ళాడాడు. ఇక ఆమె కుమారుడు ఇంద్రజిత్తు… దేవకన్యయైన హేమకు మయబ్రహ్మకు మండోదరి జన్మించింది.
ఒకరోజు వేటకై వచ్చిన రావణుడు వనంలో ఉన్న ఆమెని చూసి మండోదరిని ఇష్టపడతాడు, తనకి ఇచ్చి వివాహం చేయాలి అని కోరతాడు, ఇలా వీరికి వివాహం జరుగుతుంది, మండోదరి ఎంతో సౌందర్యవతి, అంతేకాదు ఆమె మనసు కూడా ఎంతో గొప్పది.
ఇక ఆమె పేరు తలచుకుంటే ఎలాంటి పాపాలు అయినా పోతాయి అని చెబుతారు అందరూ.
అసలు ఈ మండోదరి అంటే అర్దం తెలుసా, మండనం యస్యస ఉదరం. అంటే సన్నని నడుము గలది అని అర్ధం.తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది అనే అర్దం వస్తుంది. పంచకన్యలు ఎవరో తెలుసా ..మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపది వారిలో మండోదరి ముందు వరుసలో ఉంటారు. అందుకే పంచ కన్య అని పిలుస్తారు ఆమెని.