కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబు అభిమానులకి చేదువార్త

కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబు అభిమానులకి చేదువార్త

0
118

కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబుకు దీప తర్వాత అంత ఫేమ్ ఉంది, ఈ క్యారెక్టర్ అంటే కూడా చాలా మందికి ఇష్టం, అయితే డాక్టర్ బాబుగా చేస్తున్న నటుడు నిరుపమ్ పరిటాల ఇప్పడు తెలుగు సీరియల్ లో చాలా టాప్ స్టార్ .ఎంతో బిజీగా ఉన్నారు, అంతేకాదు చేతినిండా ప్రాజెక్టులే వరుసగా మూడు సీరియల్స్ చేస్తున్నారు ఆయన..

బుల్లితెర శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్న నిరుపమ్ 3 ఏళ్లుగా కార్తీకదీపం సీరియల్ హీరోగా చేస్తున్నాడు…అయితే నిరుపమ్ వాయిస్ కూడా చాలా మందికి ఇష్టం, ఇప్పుడు కొద్ది రోజులుగా కార్తిక దీపం సీరియల్ కు ఆయన వాయిస్ రావడం లేదు.. వేరే వాయిస్ వస్తోంది, దీంతో అభిమానులు మీ వాయిస్ బాగుంది ఈ కొత్త వాయిస్ వద్దు అని అంటున్నారు.

తన క్యారెక్టర్కి తనే డబ్బింగ్ ఇచ్చుకుంటూ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు నిరుపమ్… అయితే ఆయన కార్తీకదీపం సీరియల్ కుంకుమ పువ్వు, హిట్లర్ గారి పెళ్లాం కూడా చేస్తున్నారు, ఇక ఈ రెండు సీరియల్స్ కి వాయిస్ చెప్పడంతో ఆయనకు టైమ్ సరిపోవడం లేదు..దీంతో కార్తికదీపం వాయిస్ వేరే వారు డబ్బింగ్ చెబుతున్నారట, ఇక ఈ కొత్త వాయిస్ మాత్రమే వినాల్సి వస్తుంది అంటున్నారు సీరియల్ వర్గాలు.