హైదరాబాద్ లో బైక్ నడుపుతున్నారా – మీకు కొత్త రూల్స్ ఇవే – లేకపోతే భారీ ఫైన్లు

హైదరాబాద్ లో బైక్ నడుపుతున్నారా - మీకు కొత్త రూల్స్ ఇవే - లేకపోతే భారీ ఫైన్లు

0
105

బైకులు కార్లతో రోడ్లపైకి రయ్యని వెళుతున్నారా, ముందు ఈరూల్స్ తెలుసుకోండి, హెల్మెట్ లైసెన్స్ ఆర్సీ లేకుండా బైక్ నడిపితే ఇక మీ లైసెన్స్ రద్దు అవుతుంది, అంతేకాదు కఠిన రూల్స్ అమలులోకి వచ్చాయి, రాష్ డ్రైవింగ్ ,సిగ్నల్ జంప్, హెల్మెట్ లేకపోవడం ఇలా ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ మీరితే కచ్చితంగా శిక్షలు తప్పవు.

మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం మార్పులు చేసింది , ఇప్పటికే మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. వీటిని అనేక రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నారు. రోడ్డుపైకి హెల్మెట్ లేకుండా వస్తే ఇక మీకు ఫైన్ పడుతుంది.

బైక్ నడిపే సమయంలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ పై సస్పెన్షన్ విధిస్తారు. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ ను జీవితకాలం రద్దు చేస్తారు. ఇక మీ ఇష్టం వచ్చినట్లు బైక్ నడిపితే ఫైన్లు పడతాయి లైసెన్స్ రద్దు అవుతుంది, మీకు లైసెన్స్ రద్దు అయ్యాక కూడా మీరు బైక్ నడుపుతూ కనిపిస్తే ఇక జీవితకాలం రద్దు చేస్తారు లైసెన్స్.