గుడ్ న్యూస్ — కరోనాకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది – సీరమ్ క్లారిటీ

గుడ్ న్యూస్ -- కరోనాకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది - సీరమ్ క్లారిటీ

0
46

ఇండియాలో ఈ చలికాలంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అనే భయం చాలా మందిలో ఉంది, మరీ ముఖ్యంగా మళ్లీ కేసులు తగ్గకుండా పెరగడం, ఢిల్లీ లాంటి చోట్ల రోజు కేసులు పెరగడంతో ఆందోళన ఉంది, ఇలాంటి వేళ ఎంత వేగంగా వ్యాక్సిన్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే రోజుకు 40వేలకు పైగా నమోదవుతున్నాయి కేసులు.. ఇలా కేసుల సంఖ్యతో పాటుగా రికవరీ రేటు కూడా పెరుగుతోంది.. మన దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్లు తయారు అవుతున్నాయి, ముఖ్యంగా భారత్ బయోటెక్ ఫార్మా నుంచి రాబోతున్న కొవాగ్జిన్ మార్చి తరువాత వస్తుందంటున్నారు.

అలాగే మరో కంపెనీ . జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్సిటిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తీసుకురానుంది, భారత్ లో సీరమ్ దీనిని అందించనుంది, అయితే అందరూ దీనిపై ఆశలు పెట్టుకున్నారు, అయితే ఇది నవంబర్ నుంచి డిసెంబరు మధ్యలో వస్తుంది అని అందరూ భావించారు, తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ జనవరి నుంచి అందుబాటులోకి రాబోతున్నట్టు సీరం ఇన్సిట్యూట్ అఫ్ ఇండియా సీఈవో పూనావాలా తెలిపారు. ఇక జనవరి నుంచి ఉత్పత్తి స్టార్ట్ చేస్తారట, తర్వాత నెల నుంచి దేశంలో అందరికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.