రాజస్దాన్ లో చాలా కోటలు పాలెస్ లు ఉన్నాయి.. పలు విలాసవంతమైన హోటల్లు లగ్జరీ హోటల్స్ ఉన్నాయి, అందుకే డెస్టినేషన్ వెడ్డింగులు అక్కడ ప్లాన్ చేస్తున్నారు..ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి ఉదయ్ పూర్లోని ది ఒబెరాయ్ ఉదయ్విలాస్లో జరిగింది. ఇప్పుడు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం కూడా అదే ప్యాలెస్లో జరిగింది, అయితే అసలు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి చోట పెళ్లికి సాధారణంగా ఎంత ఖర్చు అనేది చూస్తే..
ఉదయ్ పూర్లో పెళ్లికి సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతుందట. ఇక సాధారణంగా 30 నుంచి 45 లక్షల్లో కూడా సింపుల్ గా వివాహం చేసుకోవచ్చు, ఇక మంచి ఖరీదైన రూమ్ లు, బాగా ఖరీదైన డెకరేషన్ పెళ్లి భోజనాలు వీటికి అధనంగా ఉంటాయి ఖర్చులు, ఇవన్నీ కలిపితే సుమారు మరో 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
సుమారు సాధారణ వివాహం అయితే ఇక్కడ 1 కోటి 50 లక్షల వరకూ అవుతుంది.. ఇక లగ్జరీగా వివాహం ఓ రేంజ్ లో జరిగితే 2 .5 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది, ఇక రూమ్ కి ఒక్కోరోజు 75 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకూ రెంట్ ఉంటుంది.. ఇక పెళ్లి మండపం ఇలా ఖర్చు అన్నీ కలిపి రెండు కోట్ల వరకూ అవుతుంది.