భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు ఒకే రోజు 1500

భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు ఒకే రోజు 1500

0
35

బంగారం ధర గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది. రూ.50,500కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గడంతో రూ.46,300కు చేరింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.1,500 తగ్గింది. దీంతో వెండి ధర రూ.68,000కు ట్రేడ్ అవుతోంది.ఇక ఈరోజు వెండి ధర రూ.1,500 తగ్గింది..వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.