బుల్లి తెర నటి చిత్ర మరణం పై ఎన్నో అనుమానాలు, అయితే ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అని అనేకమంది చర్చించుకున్నారు. మొత్తానికి ఈ వారం విచారణలో అనేక విషయాలు తెలిశాయి, ఇక భర్త
చచ్చిపో అంటూ ఆమెను అనడంతో ఆత్మహత్యకు పాల్పడింది, దీంతో భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు.
బుల్లి తెర నటి చిత్ర గతవారం చెన్నైలోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.రియల్ వ్యాపారి హేమనాథ్ ఈ లాక్ డౌన్ సమయంలో ప్రేమలో పడ్డారు, ఇద్దరూ ముందు బాగానే ఉన్నారు, మొత్తానికి ఈ ఆగస్టులో ఎంగేజ్ మెంట్ అయింది.ఇక ఆమె షూటింగులతో బిజీగా ఉంది, దీంతో అనుమానం కూడా హేమనాథ్ పెంచుకున్నాడు. చివరకు హేమనాథ్ ఒత్తిడితో ఆమె రిజిస్టర్ మ్యారేజ్‌కు అంగీకరించిందట.
అయితే ఇద్దరి మధ్య ఇలా అనుమానం వల్ల గొడవలు జరిగాయి. ఇక షూటింగ్ స్పాట్ కు వచ్చి ఆమెని హోటల్ కు తీసుకువెళ్లాడు, ఆ రోజు కారులో ఇద్దరు గొడవ పడ్డారు, తర్వాత హోటల్ రూమ్ లోని గొడవపడ్డారు.
ఈ గొడవలో చచ్చిపో అంటూ గట్టిగా అరిచి గది నుంచి హేమనాథ్ బయటకు వచ్చేశాడు. ఇక ఆమె మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకుంది.