పూరికి సారీ చెప్పిన మహేష్.. అసలేం జరిగింది..!!

పూరికి సారీ చెప్పిన మహేష్.. అసలేం జరిగింది..!!

0
106

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన సినిమా మహర్షి..మహేష్ బాబు 25 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అల్లరి నరేష్ ఓ కీలమైన పాత్రలో నటిస్తుండగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నేక్ లెస్ రోడ్ లో ఘనంగా జరిగింది.. కాగా ఈ ఫంక్షన్ లో తన తో సినిమా చేసిన డైరెక్టర్ లందరికి థాంక్స్ చెప్పిన మహేష్ ఓ డైరెక్టర్ ని మరిచిపోయాడు.. అతనే.. పూరి జగన్నాధ్.. మహేష్ బాబుకి పోకిరి లాంటి సూపర్ హిట్ ని అందించిన పూరి మహేష్ ని స్టార్ నుంచి సూపర్ స్టార్ చేశాడనే చెప్పాలి..

అయితే ఇంతటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ పేరు చెప్పలేదు. దీంతో ఫంక్షన్ ముగిసిన వెంటనే తన ట్వీట్టర్ ద్వారా స్పందించారు. నా స్పీచ్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పడం మరచిపోయాను. నా 25 సినిమాల ప్రయాణంలో పోకిరి చిత్రం నన్ను సూపర్ స్టార్ అయ్యేలా చేసింది. ఇందుకు పూరీ జగన్నాథ్‌కి కృతజ్ఞతలు. పోకిరి చిత్రం ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం అని తెలిపారు. ఇర ఆ ట్వీట్ చూసిన పూరీ జగన్నాథ్.. థ్యాంక్యూ సో మచ్ సర్.. మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాం. మహర్షి ట్రైలర్ రాకింగ్ అని పోస్ట్‌ చేశాడు.