ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం

ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం

0
66

ఎన్నికల సమయంలో అనేక సెంటిమెంట్లు వినిపిస్తాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయో ఆ జిల్లా మెజార్టీ సీట్ల ప్రకారం సీఎం కూడా వారే అని చెబుతారు.. అలాంటి జిల్లానే తూర్పుగోదావరి జిల్లా, ఇది ఉభయతెలుగురాష్ట్రాలు విడిపోకముందు నుంచి చెబుతున్న మాట.. ఇక 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ ఎక్కువ సీట్లు సాధించింది. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.ఇప్పుడు ఓ సెగ్మెంట్ గురించి పెద్దగా చర్చించుకుంటున్నారు ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధినేత సీఎం అవుతారు అని చెబుతున్నారు.
ఇంతకి ఆ నియోజకవర్గం ఏమిటి అని అనుకుంటున్నారా, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఉంగుటూరు నియోజకవర్గం.

ఇప్పటి వరకు అక్కడ పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వారు అయితే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అన్న బలమైన సెంటిమెంట్ ఒకటి ఉంది.. దీనిని రాష్ట్రంలో జిల్లా నాయకులు నుంచి సీఎం స్ధాయి నేతల వరకూ అందరూ నమ్ముతారు.. ముందు ఈ ఫలితం వస్తే తమకు గెలుపు పక్కా అని భావిస్తారు.. 2004-09 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వట్టి వసంత్ కుమార్ గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఇక్కడ స్టేట్ లో టీడీపీ రూలింగ్ కు వచ్చింది. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్యనే పోటీ ఉంది మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.