గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతీ ఒక్కరు ఒకటో తేది వచ్చింది అంటే చాలు గ్యాస్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని ఎదురుచూస్తారు, ఎందుకు అంటే ప్రతీ నెలా ఒకటో తేదిన గ్యాస్ ధర పెరగడం తగ్గడం మార్పులు జరుగుతూ ఉంటుంది, ఆయిల్ కంపెనీలు ఈ రేట్లుని నిర్ణయిస్తాయి. అదే రేటు ఆ నెల మొత్తం ఉంటుంది, అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను నెలకు ఒకసారి కాకుండా ప్రతి వారం మార్చాలని భావిస్తున్నాయట. దీనికి తగినట్లుగా ఆలోచన చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, దీని వల్ల ఆయిల్ కంపెనీలకు భారీ ఊరట కలుగుతుంది, నెల ఒకటో తేదిన ఈ రేటు ఫిక్స్ చేస్తున్నారు.. దీని వల్ల నెల అంతా అదే రేటు ఉంటోంది..దీని వల్ల కంపెనీలకు నష్టం కలుగుతోంది.
అందుకే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి వారం రేట్లను సమీక్షించే విధానాన్ని తీసుకురాబోతున్నాయని టాక్ నడుస్తోంది. అయితే దీనిని ఇంకా ఫైనల్ చేయలేదు, ఇలా నెలకి ఓసారి రేటు మార్పు ఉంటుందా వారానికి ఓసారి ఉంటుందా అనేది వచ్చే రోజుల్లో తేలనుంది.వీటికి సంబంధించి, చమురు కంపెనీల అధికారులు ఇంకా అధికారిక సమాచారం రాలేదు..