బిగ్బాస్ సీజన్ 4 లో విజేతగా అభిజిత్ నిలిచారు, అయితే అభికి సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి, అలాగే ఇక రన్నరప్ గా అఖిల్ నిలిచాడు, ఇక సెకండర్ రన్నరప్ గా నిలిచిన సోహెల్ కి కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి, ముఖ్యంగా ఇప్పుడు సినిమా హీరోగా అయ్యే అవకాశాలు వస్తున్నాయి, తాజాగా ఆయనతో ఓ సినిమాని అనౌన్స్ చేసింది ఓ చిత్ర నిర్మాణసంస్ధ.
జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ వంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి సోహెల్తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇక దీనికి దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యారు, శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించనున్నారు ఈ సినిమాకి.. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేయాలి అని భావిస్తున్నారు, ఇక 3 నెలల్లో ఈ సినిమా పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి, ఇక సోహెల్ సినిమా తీస్తే అందులో నటిస్తాను అని చిరంజీవి చెప్పారు, అంతేకాదు కమెడియన్ బ్రహ్మనందం కూడా మాట ఇచ్చారు రెమ్యునరేషన్ లేకుండా చేస్తాను అని.