బాబుకు కేవీపీ లేఖ షాక్ లో కాంగ్రెస్

బాబుకు కేవీపీ లేఖ షాక్ లో కాంగ్రెస్

0
83

ఏపీలో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.. తాజాగా సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ నేత కేవీపీ బహిరంగ లేఖరాశారు.. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అయింది.. బాబు వైఖరి వల్ల పోలవరం విషయంలో ఏపీకీ తీరని నష్టం జరిగింది అని ఆయన లేఖలో చెప్పారు.. రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగల స్వార్ధం వల్ల బీజేపీతో బాబు లాలూచీపడి ఏపీకి తీరని ద్రోహం చేశారు అని అన్నారు…

విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా సాధించలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పోలవరం విషయంలో ఏపీపై భారం పడటాన్ని అంగీకరించేదిలేదన్నారు. ఇక రాజకీయంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పెద్ద స్ట్రాంగ్ గా లేదు, మరో పక్క కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు దగ్గరగా ఉంటున్నారు. ఈ సమయంలో కేవీపీ ఇలా బాబుకి లేఖరాయడం అలాగే విమర్శించడం పై కాంగ్రెస్ శ్రేణులు సైకిల్ పార్టీ నేతలు ఖంగుతిన్నారు.