మన సౌత్ ఇండియా సినిమాలు ఏదైనా హిట్ అయితే వాటిని బాలీవుడ్ నిర్మాతలు బీ టౌన్ లో రీమేక్ చేస్తారు, ఇప్పుడు చాలా తెలుగు సినిమాలు ముంబై మార్కెట్లో బాలీవుడ్ నిర్మాతలు ఫ్యాన్సీ రేట్లు పెట్టి రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజ్ సినిమా గురించి ఓ టాక్ నడుస్తోంది.
క్రాక్ సినిమా కూడా అప్పుడే హిందీలోకి రీమేక్ చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది.. రవితేజకు మళ్లీ మంచి విజయాన్ని అందించింది, పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో రవితేజ నటన అద్బుతం అనే చెప్పాలి.
ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇక ఈ చిత్రం సోనూసూద్ చేయాలి అని ఆలోచన చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన బాగా సెట్ అవుతారు అని భావిస్తున్నారట, అయితే త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.. మరి సోనూసూద్ అభిమానులు ఈ వార్త విని చాలా ఆనందంలో ఉన్నారు.. ఇది నిజం అవ్వాలి అని కోరుకుంటున్నారు.