పాలు అంటే చాలా మందికి ఇష్టం, మరీ ముఖ్యంగా పాలు లేకపోతే కొందరు పాల పొడి కూడా వాడుతూ ఉంటారు, ఇక పాలు ఇచ్చే రుచి వేరు పాలపొడి రుచి వేరు… ఇక తీయగా తినాలి అని చూసేవారు ఇంట్లో ఉండే పాలపొడిని కూడా తీసుకుంటారు. అయితే పాలపొడి అనేది వేడి నీటిలో పోస్తే అది పాలుగా మారిపోతుంది… ఇక టీ కాఫీ అనేది కలుపుకోవచ్చు, ఇన్ స్టంట్ మిల్క్ గా దీనిని వాడతారు.
పాలలో 87.3% నీళ్ళూ, 3.9% మిల్క్ ఫ్యాట్స్, 8.8% ఫ్యాట్ లేని మిల్క్ సాలిడ్స్ ఉంటాయి. ఇక పాలపొడి తయారు చేసే సమయంలో పాలు వేడి చేసి అందులో నీటిని మొత్తం ఆవిరి చేస్తారు… ఇక ప్రాసెస్ చేసి ఆ పాలపొడి తయారు చేస్తారు…
మినరల్స్, విటమిన్స్ మెగ్నీషియం, కాల్షియం, జింక్, పొటాషియం, విటమిన్స్ ఏ, డీ, ఈ, కే ఈ ఈ పాలపొడిలో ఉంటాయి..
పాల పొడి ప్యాకెట్స్ వెనుక ఎంత పొడికి ఎన్ని నీళ్ళు కలపాలి అని రాసే ఉంటుంది… అన్ని మాత్రమే కలపండి.. అప్పుడు పోషకాలు అందుతాయి…ఇక ఈ పాలపొడి పాల కంటే రుచి తక్కువ ఉంటుంది పోషకాలు సమానమే… షుగర్ ఉన్న పాలపొడి తక్కువ తీసుకోండి.