తమిళ హీరో అజిత్ సమాజ సేవ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు, ఎవరికి అయినా ఏదైనా సాయం చేయాలి అంటే అజిత్ వెంటనే ఒకే చెబుతారు.. చిత్ర సీమలో కూడా ఆర్టిస్టులు ఎలాంటి సాయం కోరినా కాదు అనరు, ఇక ఏదైనా విపత్తులు సంభవించినా ఆ సమయంలో ఇలా అనేక మందికి సాయం చేశాడు, ఇక తాజాగా ఇప్పుడు ఓ వ్యక్తికి సాయం చేశాడు అజిత్.
హైదరాబాదులో ఓ ఇడ్లీ బండి వ్యక్తి ఆర్థిక పరిస్థితి పట్ల స్పందించిన అజిత్ అతడికి రూ.1 లక్ష సాయం అందించినట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ షూటింగ్ కు వచ్చాడు అజిత్, ఈ సమయంలో అక్కడ షూటింగ్ దగ్గర్లో ఓ ఇడ్లీ బండిని చూశాడు, అక్కడ అతని అమ్మకం అతని పరిస్దితి గమనించాడు.
తక్కువ ధరలోనే రుచికరమైన ఇడ్లీలు అందిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్న ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదు అని తెలుసుకున్నాడు, ఆ వ్యాపారి తన కుమార్తె చదువు కోసం ఇలా కష్టపడుతున్నాడు.. దీంతో అజిత్ ఆ వ్యాపారికి సాయం అందచేశాడు.. లక్ష రూపాయల నగదు సాయం అతనికి అందించాడు, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.