నిజమే 40 ఏళ్లు రాజకీయాంగా ఎన్నో చూశారు చంద్రబాబు.. ఎంత ధీమా ఉంటే కచ్చితంగా 120 పైగా స్ధానాలు గెలుస్తాం అని చెబుతారు.. మరో పక్క దేశంలో పలు రాష్ట్రాల్లో నాయకుల కోసం వారి విజయం కోసం ప్రచారం కూడా చేసేందుకు వెళుతున్నారు.. ఈ సమయంలో జగన్ కు కాస్త టెన్షన్ పెరిగిందట. ఏమి చూసుకుని బాబు ఇంత దైర్యంగా ఉన్నారు అని ఆలోచన చేస్తున్నారట.. అయితే సంక్షేమ పథకాలు మనల్ని మరోసారి గట్టెక్కిస్తాయి.. విజయం మనదే మీరు కంగారు పడకండి అని బాబు చెబుతున్నారు సొంత పార్టీ నేతలకు.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట వారిని మార్చివేశాను, అంతా సర్వేల ప్రకారం వెళ్లాము ఎమ్మెల్యేల పనితీరు అన్నీ చూసుకున్నాము అని బాబు సీనియర్లతో అన్నారట.. అయితే జగన్ మాత్రం ప్రశాంత్ కిషోర్ ని నమ్ముకుంటే ఇటు బాబు మాత్రం ఏపీలో సర్వేలను తన పార్టీ డ్యాష్ బోర్డుని మాత్రమే నమ్ముకున్నారు.. ఇప్పుడు జగన్ నిజంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.. మరి ఫలితం తారుమారు అయితే నిజంగా ఇక్కడ జగన్ గురించి పీకే గురించి దేశ వ్యాప్తంగా చర్చ మాత్రం జరుగుతుంది అని చెబుతున్నారు టీడీపీ నేతలు.. అయితే బాబుని మాత్రం తక్కువ అంచనా వేయద్దు అని చెప్పారట జగన్.