ఈసారి సీఎం చంద్రబాబు ఎన్నికల తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఎన్నికలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ప్రజలంతా విశ్వసించే విధంగా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి తాము పోరాడుతున్నాము అని అన్నారు చంద్రబాబు, ఇప్పటికే ఈవీఎంల పై ఆయన విమర్శలు చేశారు. అలాగే 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రివ్యూ పిటిషన్ వేసింది దీనిని సుప్రీం కోర్టు కొట్టివేసింది దీనిపై బాబు మాట్లాడుతూ తాము సుప్రీం నిర్ణయాన్ని గౌరవిస్తాం అయినా మా పోరాటం సాగుతుంది అని తెలియచేశారు ఆయన.
50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని కోరుతూ తాము వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. దీనిపై మళ్లీ ఎన్నికల కమిషన్(ఈసీ)ని కలుస్తామని, అదే విధంగా ఎన్నికల విధానంలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారిని చైతన్యపరుస్తామని తెలిపారు.