మనుషులు అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు.. ఒక్కోసారి కొన్ని ఘటనలు నిరూపితం అయ్యాయి కూడా, అయితే ఇటీవల భారీ యంత్రాలతోనే ఎలాంటి పని అయినా చేస్తున్నాం, కొన్ని వస్తువులు ఇలాంటి వాటితోనే కదిలిస్తున్నాం.. అయితే ఇక్కడ నాగాలాండ్ ప్రజలు ఇలాంటి యంత్రాలు ఏమీ వాడకుండా పదుల సంఖ్యలో జనం వచ్చి ఓ ఇంటిని లేపి పక్కన పెట్టారు.
ఇంటి ఎత్తును పెంచుకోడానికి.. ముందుకు, వెనక్కి కదుపుకొనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, అయితే ఇప్పుడు ఏకంగా మిషన్లు టెక్నాలజీ ఏమీ వాడకుండా వీరు చాలా సింపుల్ గా ఈ వర్క్ చేశారు..ఐకమత్యంగా ఈ పని బాగా చేశారు అని అందరూ అంటున్నారు, సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
నాగాలాండ్లోని యాచెమ్ అనే గ్రామంలో ఓ ఇంటిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించాలని గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. ఆ ఇంటి కింద పొడవైన కర్రలకు కట్టారు.. వంద మంది ఆ ఇంటిని ముందుకు కదిలించారు.
ఐకమత్యమే మహాబలం మరి ఆ వీడియో మీరు చూడండి
Yet another video where the Nagas show us that Unity is strength!
House shifting in progress at village in Nagalandpic.twitter.com/XUGhiEGNe7
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) February 5, 2021