మొత్తానికి కొద్ది రోజులుగా తెలంగాణలో ఓ వార్త వినిపిస్తోంది …వైయస్ షర్మిల కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నారు అని.. అయితే దీనిపై అనేక వార్తలు మీడియాలలో వచ్చాయి… నేడు
రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల… లోటస్ పాండ్ లోని పార్టీ కీలక నేతలతో ఆమె సమావేశం అయ్యారు… జిల్లాల నుంచి పలువురు నేతలు ఇక్కడకు హాజరు అయ్యారు.
తెలంగాణలో ప్రతి జిల్లా వారితో మాట్లాడాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. అందులో భాగంగానే ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలతో సమావేశం అవుతున్నానన్నారు. ఇక కార్యకర్తల అభిప్రాయం అలాగే గ్రౌండ్ రియాలిటీ గురించి తెలుసుకుంటున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు? ఎందుకు రాకూడదని ప్రశ్నించారామె. ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకువస్తాము అన్నారు, ఇక త్వరలో అన్నీ విషయాలు చెబుతాను అన్నారు.. మొత్తానికి వచ్చే కొద్ది రోజుల్లో కొత్త పార్టీ పేరు అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది
అని తెలుస్తోంది.