రియల్ అజ్ఞాతవాసి.. రవిప్రకాశ్‌పై పవన్ కల్యాణ్ సెటైర్..

రియల్ అజ్ఞాతవాసి.. రవిప్రకాశ్‌పై పవన్ కల్యాణ్ సెటైర్..

0
105

టీవీ9 అధినేత రవిప్రకాశ్‌పై పవన్ కల్యాణ్ సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. మీడియా దిగ్గజం, టీవీ9 అధినేత రవి ప్రకాశ్‌ను తొలగించారనే వార్త ప్రాంతీయ, జాతీయ మీడియాలోనూ రోజంతా కోడై కూసింది. ఈ వార్త రోజంతా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా రవి ప్రకాశ్ పై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించడం సంచలనంగా మారింది. గతంలో శ్రీరెడ్డి వివాదంలో పవన్ కల్యాణ్‌కు, తన కుటుంబానికి వ్యతిరేకంగా టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్‌లలో వార్తాలు రావడంతో పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఘాటైన పోస్టులు, ఫోటోలతో రచ్చ చేశారు. ఆ తర్వాత టీవీ9, ఏబీఎన్ ఛానెల్స్ కథనాల తీవ్రత తగ్గడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు అదే విషయాన్ని మల్లి గుర్తుకు చేస్తు పవన్ కల్యాన్ ‘రవి నిన్ను రియల్ అజ్ఞాతవాసి అని ఎందుకు అన్నానో ఇప్పుడైనా తెలిసిందా?’ ఇప్పుడు గుర్తించావా? అంటూ రవి ప్రకాశ్ పై ట్వీట్ చేశాడు.

దీనిపై పవన్ ఫ్యాన్స్ రియల్ అజ్ఞాతవాసి రవిప్రకాశ్ గారు మిమ్మల్ని ‘టీవీ9 నుంచి తొలగించడంతో పొద్దున నుంచి గిలగిలా కొట్టేసుకొంటున్నారు. ‘నువ్వు అప్పుడే చెప్పావ్ అన్నా.. ఎవరు వినలేదు’, ‘తప్పుడు వెధవలకు తల్చుకోవాలంటేనే తడిసిపోయేలా తరిమి తరిమి కొడుతున్నావు కదన్నా.. తగ్గే సమస్యే లేదనలా..’ అంటూ కామెంట్లతో రెచ్చి పోతున్నారు. కాగా ఈ వార్త పై స్పనందిచిన రవి ప్రకాశ్ ఏకంగా టీవీ9 ఛానెల్‌లో లైవ్‌లోకి వచ్చి తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలు ఎప్పటికీ నిలబడలేవు. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నాపై వ్యతిరేక వార్తలు ప్రచారం చేసిందుకు ధన్యవాదాలు అంటూ చురకలు అంటించారు. ఎది ఎమైనా సమయం చూసి రాయి వెయ్యలి అంటె పవన్ ని చూసి నేర్చుకోవాలి.