జగన్ చంద్రబాబు పది రోజులు బిజీ షెడ్యూల్

జగన్ చంద్రబాబు పది రోజులు బిజీ షెడ్యూల్

0
66

ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి ఇక ఫలితాల కోసం మాత్రమే చూస్తున్నారు నాయకులు.. మే 23 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.. అయితే కౌంటింగ్ ముందు ఇక టెన్షన్ టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఇక పార్టీ అధినేతలు అభ్యర్దులతో మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు.. అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి అని చెబుతున్నారు.. ఈ నెల 13న జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష చేయనున్నారు..16న వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనుంది.

21న వైసీపీ అభ్యర్థులతో జగన్ భేటీ అవ్వనున్నారు.. ఇక 19న ఎగ్జిట్పోల్ వెల్లడికానున్నాయి.. 23న అసలైన ఫలితాలు రానున్నాయి. అందుకే పతాకస్ధాయికి ఇక టైం రావడంతో పెద్ద ఎత్తున నేతలు ఎదురుచూస్తున్నారు. ఇక టెన్షన్ కూడా అలాగే నేతల్లో పెరిగిపోయింది. అలాగే రెండు పార్టీల నుంచి నాయకులు చేజారి పోకుండా పార్టీ అధినేతలు తమ నేతలను జాగ్రత్త చేసుకుంటున్నారు.. ఎక్కడికక్కడ పార్టీ నేతలు వేరే పార్టీ నేలతలతో కలవకుండా జాగ్రత్త పడుతున్నారు.. మొత్తానికి ఇప్పుడు ఇదే పెద్ద అంశంగా చర్చకు వస్తోంది.