చై ప‌క్క‌న బికినీలో సామ్..!!

చై ప‌క్క‌న బికినీలో సామ్..!!

0
43

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చెది అక్కినేని నాగచైతన్య, సమంత జంట‌. పెళ్ళైన తర్వాత వీరిద్దరు మొదటి సారి జంటగా నటించిన చిత్రం మ‌జిలీ. ఈ సినిమా మంచి విజ‌యం సాధించి బాక్సఫీస్ వద్ద మంచి వస్సుళ్లను రాబట్టింది. దీంతో స‌క్సెస్‌ని ఎంజాయ్ చేసేందుకు స‌మంత‌, చై హాలీడ్ ట్రిప్‌గా స్పెయిన్‌కి వెళ్లారు. ప్రస్తుతం వారిద్దరూ స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్నారు.

అక్కడ ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారెంట్ ముందు జంటగా తీసుకున్న ఫొటోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఇప్పటి వరకు రుచి చూసిన అద్భుతమైన వంటకాల్లో ఇదీ ఒకటి’ అని చైతన్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదే కాకుండా బార్సిలోనాలో స‌మంత‌, చైతు కి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో నాగచైతన్య, సమంత బ్లాక్ బికినీలో మెరిసిపోతున్నారు. ఇద్దరూ పడక కుర్చీల్లో సేదతీరుతున్నట్టు ఉన్న ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.సామ్ ఏది చేసిన వెరైటిగానే ఉంటుంది.