బ్యూటీ పార్లర్ కు వెళ్లి అక్కడ నుంచి పారిపోయిన పెళ్లి కూతురు ఎందుకంటే

-

ఈ రోజుల్లో పెళ్లి సెట్ అయిన తర్వాత మూడు ముళ్లు వేసేవరకూ కాస్త టెన్షన్ లోనే ఉంటున్నారు అబ్బాయిలు..ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్దితి.. కొందరు అమ్మాయిలు తమ ప్రియుల గురించి పెళ్లి మండపంలో చెబుతున్నారు మరికొందరు శోభనం రూమ్ లో చెబుతున్నారు, దీంతో ఏమి చేయాలో అర్దం కాక పాపం పెళ్లి కొడుకులు ఉంటున్నారు, అయితే అబ్బాయిలకే కాదు అమ్మాయికి కూడా ఇలాంటి ఘటనలు ఎదురు అవుతున్నాయి.
తాజాగా చెన్నై శివారు ప్రాంతంలోని పూందమల్లి సమీపంలోని చెంబరం పాక్కంలో  ఓ ఘటన జరిగింది, అక్కడ పెళ్లికి సిద్దం అయింది ఓ వధువు, అందంగా మేకప్ వేసుకోవడానికి బ్యూటీపార్లర్ కు వెళ్లింది. అయితే ఎంత సేపు అయినా ఆమె రాలేదు, అక్కడ ముందు ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు… వరుడు ఆమె కోసం చూస్తున్నాడు.. కాని ఇంతలో ఆమె పరార్ అని తెలిసింది
అందరూ షాక్ అయ్యారు.
 వరుడి బంధువులు ప్లెక్సీలు, బ్యానర్లు చింపేశారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ,  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఎక్కడికి వెళ్లింది అనేది ఇంకా తెలియదు, దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు, అయితే ఆమెకి ముందు ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అని కూడా తెలుసుకుంటున్నారు బంధువులు ఆమె ఫ్రెండ్స్ ద్వారా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...