‘A’ మూవీ రివ్యూ..

-

టైటిల్ : ‘ A ‘
నటీనటులు : నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని తదితరులు..
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి
సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు
సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్
ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్
సంగీతం: విజయ్ కురాకుల,
నిర్మాత: గీతా మిన్సాల
దర్శకత్వం: యుగంధర్ ముని

- Advertisement -

యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లు గా నటించారు. ప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్ అన్నీ అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా మార్చి 5న (నేడు) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏవిధంగా మెప్పించిందో చూద్దాం..

కథ :

సంజీవ్(నితిన్ ప్రసన్న) గతం మర్చిపోయిన వ్యక్తి గా తన భార్య పల్లవి(ప్రీతి అశ్రాని) తో కలిసి జీవిస్తూ ఉంటాడు. జీవనం కోసం ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో పనిచేస్తూ ఉంటున్న తరుణంలో ఒకకల అతన్ని పదేపదే వేధిస్తూ ఉంటుంది. అయితే సంజీవ్ కే ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సంజీవ్ కి గతం గుర్తుకు వస్తే కానీ ఆ కల తాలూకు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోలేమని సలహా ఇస్తారు. దీంతో తన గతం తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇదే సమయంలో ఓ చిన్న పిల్లల కిడ్నాప్ జరుగుతుంది. దీనికి సంజీవ్ కారణమని అరెస్ట్ చేస్తారు.. అసలు ఈ కిడ్నప్ కి సంజీవ్ కి సంబంధం ఏంటి..కిడ్నాపర్‌కు సంజీవ్‌కు ఉన్న సంబంధం ఏంటి.. దీనికి తన గత జీవితానికి సంబంధం ఏంటి అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు :

సినిమాలు అన్ని పాత్ర లు తమ పాత్ర మేరకు బాగానే నటించాయి. ముఖ్యంగా హీరో నితిన్ ప్రసన్న సంజీవ్ పాత్ర లో ఒదిగిపోయాడు. గతం మర్చిపోయిన వ్యక్తి గా ఎంతో న్యాచురల్ గా నటించాడు. సంజీవ్ కి తొలి సినిమానే అయినా ఎన్నో సినిమాల అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రీతీ ఆష్రాని పల్లవి పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని ఎమోషనల్‌ సీన్లలో కూడా ఆమె అవలీలగా నటించారు. అలాగే మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు :

సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచాడు. సస్పెన్స్‌ను ఆద్యంతం గుప్పిట్లో ఉంచి నడిపించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ స్లోనెరెషన్‌ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌ కాస్త నెమ్మదిగా సాగి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్‌ కురాకుల సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మాయ చేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ప్రవీణ్‌ కె బంగారి సినిమాటోగ్రాఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కథ
ప్రీతీ ఆస్రాణి
ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా కొన్ని సీన్లు లాగ్..

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...